హర్యానాలో కాంగ్రెస్ తుఫాన్‌లో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయం: రాహుల్
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 9:30 PM ISTహర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య సమస్య ఎక్కువగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దీనికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చండీగఢ్‌లో పర్యటించారు. ప్రదాని నరేంద్ర మోదీ దేశంలో విభజించి పాలన సాగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు రాహుల్ గాందీ.
రాబోయే హర్యానా ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ తుఫాన్‌లో బీజేపీ కొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల తాను అమెరికాలో పర్యటించిన సమయంలో హర్యానా వాసులను కలిశానని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి దొరకడం లేదనీ.. అందుకే అమెరికా వచ్చామని వారు తనతో చెప్పారని రాహుల్ గాంధీ వెల్లడించారు. డల్లాస్, టెక్సాస్ లో ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రమాదకర స్థితిలో కజకిస్థాన్, తుర్కియే, దక్షిణ అమెరికా దేశాలు దాటి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నామని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తే వారికి ఆ దుస్థితి వచ్చేదే కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.