నాపై ఈడీ దాడులకు ప్లాన్ చేశారు: రాహుల్‌గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 Aug 2024 12:30 PM IST
rahul gandhi, congress, tweet,  ed raid,

 నాపై ఈడీ దాడులకు ప్లాన్ చేశారు: రాహుల్‌గాంధీ 

కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. తనపై దాడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్లాన్ చేస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా తనకు ఈడీ సంస్థలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులే చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలా ఇలాంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి.. నోరు నొక్కే ప్రయత్నాలు చేస్తోందంటూ మండిపడుతున్నారు.

కాగా.. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టిన రాహుల్‌ గాంధీ.. పార్ల‌మెంట్‌లో బీజేపీపై చ‌క్ర‌వ్యూహాం విమ‌ర్శ‌లు చేసినందుకు .. ఈడీతో సోదాలో చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉందని రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. అయితే ఈడీ త‌నిఖీల‌ను ఎదుర్కొనేందుకు రిక్త హ‌స్తాల‌తో ఎదురుచూస్తున్న‌ట్లు రాహుల్ చెప్పారు. చ‌క్ర‌వ్యూహాంపై త‌న ప్రసంగాన్ని ఒక్క‌రిలో ఇద్ద‌రు న‌చ్చ‌లేద‌ని పేర్కొన్నారు. చ‌క్ర‌వ్యూహం త‌ర‌హాలో ఆరుగురు వ్య‌క్తులు దేశాన్ని నాశ‌నం చేస్తున్న‌ట్లు రాహుల్ ఆరోపించారు. అయితే ఆ చ‌క్ర‌వ్యూహాన్ని ఇండియా కూట‌మి బ‌ద్ద‌లు కొట్ట‌నున్న‌ట్లు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు.


Next Story