కాంగ్రెస్ నేత, వయాగఢ్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు షాకిచ్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చిన కోర్టు శిక్ష విధించింది.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ గురువారం పోస్టర్లు వేసింది. కోర్టు విచారణ కోసం కాంగ్రెస్ ఎంపీ వచ్చిన సూరత్ కోర్టు వెలుపల పోస్టర్లు అంటించారు. "ప్రజాస్వామ్యానికి మద్దతుగా సూరత్ వెళ్దాం" అని భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ చిత్రాలతో పాటు పోస్టర్లు ఉన్నాయి.