దారుణం : స్ట‌ఫ్ త‌క్కువైంద‌ని.. కుక్కపిల్ల‌ల తోక, చెవులు క‌త్తిరించి ఉప్పు పూసుకుని తిన్న మందుబాబు

Puppies' ears and tails chopped off and eaten for a snack by drunks.ని కుక్క పిల్లల‌ తోక‌, చెవుల‌ను కోసి ఊప్పు పూసుకుని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 10:50 AM IST
దారుణం : స్ట‌ఫ్ త‌క్కువైంద‌ని.. కుక్కపిల్ల‌ల తోక, చెవులు క‌త్తిరించి ఉప్పు పూసుకుని తిన్న మందుబాబు

ఓ వ్య‌క్తి మ‌ద్యం సేవిస్తున్నాడు. స్ట‌ప్ త‌క్కువైంద‌ని కుక్క పిల్లల‌ తోక‌, చెవుల‌ను కోసి ఊప్పు పూసుకుని తిన్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. బ‌రేలీ జిల్లాలోని ఫ‌రీద్‌పూర్ ప్రాంతానికి చెందిన ముఖేష్ వాల్మీకి మ‌రో వ్య‌క్తితో క‌లిసి మ‌ద్యం సేవిస్తున్నాడు. ఆ స‌మ‌యంలో స్ట‌ఫ్ అయిపోయింది. దీంతో అక్క‌డ ఉన్న రెండు కుక్క పిల్ల‌లను పట్టుకున్నాడు. ఓ కుక్క చెవుల‌ను, మ‌రో కుక్క తోక‌ను క‌ట్ చేశాడు. అనంత‌రం వాటికి ఉప్పు పూసుకుని స్ట‌ఫ్‌గా లాగించేశాడు. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు పీపుల్ ఫ‌ర్ యానిమ‌ల్స్ సంస్థ‌కు స‌మాచారం అందించారు.

పీపుల్ ఫ‌ర్ యానిమ‌ల్స్ స‌భ్యుడు ధీర‌జ్ పాఠ‌క్ వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని తీవ్ర ర‌క్త‌స్రావం అవుతున్న కుక్క‌పిల్ల‌ల‌ను చికిత్స నిమిత్తం ప‌శు వైద్య‌శాల‌కు త‌ర‌లించాడు. అనంత‌రం ఈ దారుణ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై జంతువులపై క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అఖిలేష్ చౌరాసియా దర్యాప్తు ప్రారంభించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


కాగా.. బరేలీ జిల్లాలో జంతు హింస కేసులు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇండియ‌న్ వెట‌ర్న‌రీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎలుకకు రాయి క‌ట్టి కాల్వ‌లో ముంచి చంప‌డానికి ప్ర‌య‌త్నించార‌ని ద‌ర్యాప్తులో తేలింది.

Next Story