'నిందితుడికి బెయిల్ ఇవ్వాలా? వద్దా?'.. చాట్ జీపీటీని అడిగిన పంజాబ్ కోర్టు
కొత్త తరం సెర్చ్ ఇంజిన్ 'చాట్ జీపీటీ' సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే
By అంజి Published on 29 March 2023 6:45 AM GMT'నిందితుడికి బెయిల్ ఇవ్వాలా? వద్దా?'.. చాట్ జీపీటీని అడిగిన పంజాబ్ కోర్టు
కొత్త తరం సెర్చ్ ఇంజిన్ 'చాట్ జీపీటీ' సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచాన్ని అత్యంత ఆశ్చర్యపరుస్తోంది. దీంతో చాలా మంది చాట్‌జీపీటీతో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమకు తెలియిన ఎన్నో ప్రశ్నలను సమాధానాలను తెలుసుకుంటున్నారు. తాజాగా ఓ కేసు పరిష్కార విషయమై న్యాయ సలహా కోసం పంజాబ్ - హర్యానా హైకోర్టు చాట్ జీపీటీని ఆశ్రయించింది. ఓ క్రైమ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు విషయంలో పలు సూచనల గురించి చాట్ జీపీటీని అడిగి తెలుసుకుంది.
'ఇతరులపై అతి క్రూరత్వంగా దాడి చేసిన వ్యక్తి బెయిల్ అడుగుతున్నాడు. దీనిపై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి?' అని చాట్‌జీపీటీని జడ్జిలు అడిగారు. దీనికి చాట్ జీపీటీ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. క్రూరత్వం కారణంగానే మనుషులను చంపుతున్నారు.. కాబట్టి తాను బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తారని చాట్ జీపీటీ సమాధానం ఇచ్చింది. అయితే ఆ దాడి తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని తెలిపింది.
నిందితుడు.. తాను నిర్దోషినని బలమైన సాక్ష్యాలతో నిరూపించుకుంటూనే బెయిల్‌కు అర్హుడని, లేదంటే బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని చాట్ జీపీటీ తెలిపింది. నిందితుడి నేర చరిత్ర, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని కోర్టులు బెయిలు మంజూరు చేయొచ్చని చాట్ జీపీటీ సూచించింది. నిందితుడికి బెయిల్ మంజూరు విషయమై చాట్ జీపీటీ సలహా కోరడంపై జడ్జిలు స్పందించారు. కేవలం న్యాయశాస్త్రంపై చాట్ జీపీటీ ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఎక్స్‌పరమెంట్ చేశామని స్పష్టం చేశారు.
‘చాట్ జీపీటీ’ ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తీర్పులను వెలువరించ కూడదని జస్టిస్ అనూప్ చిట్కారా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో న్యాయసలహా తీసుకోవడం భారతీయ న్యాయ వ్యవస్థలోనే మొట్టమొదటదిగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌కు చెందిన ఓ నిందితుడిపై 2020లో హత్య, ఇతర నేరాలకు సంబంధించి కేసు నమోదైంది. సదరుడు నిందితుడు బెయిలు కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే నిందితుడి నేర చరిత్ర ఆధారంగా బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.