పెట్టుబడుల కోసం.. చెన్నై, హైదరాబాద్‌లో పంజాబ్‌ సీఎం పర్యటన

Punjab CM to showcase investment opportunities in Chennai, Hyderabad. చండీగఢ్: పంజాబ్‌ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, పెట్టుబడుల కోసం

By అంజి  Published on  19 Dec 2022 3:33 AM GMT
పెట్టుబడుల కోసం.. చెన్నై, హైదరాబాద్‌లో పంజాబ్‌ సీఎం పర్యటన

చండీగఢ్: పంజాబ్‌ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, పెట్టుబడుల కోసం పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం చెన్నై, హైదరాబాద్‌లలో తన పర్యటనను ప్రారంభించారు. పెట్టుబడులు, కీలక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాల కోసం వ్యాపార ప్రతినిధులతోనూ, ప్రముఖ కంపెనీలతోనూ సోమవారం సమావేశం కానున్న ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ చెన్నై చేరుకున్నారు. అదేవిధంగా.. మాన్ మంగళవారం హైదరాబాద్‌లో పరిశ్రమల కెప్టెన్లతో ఇంటరాక్టివ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి ఈ రెండు రోజుల కీలక పర్యటన భారీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పెద్ద కంపెనీల నుండి నైపుణ్యం పొందడంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 23-24 తేదీల్లో మొహాలీలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఆహ్వానం పంపనున్నారు. భగవంత్‌ మాన్ పంజాబ్‌ రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా ఎదగడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం దాని కోసం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదన్నారు.

పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రాన్ని అధిక వృద్ధి పథంలో చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని పెద్ద పారిశ్రామిక హబ్‌ల పర్యటన ఒకవైపు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని, మరోవైపు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను తెరుస్తుందని ముఖ్యమంత్రి ఊహించారు. పంజాబ్‌ను తాను వ్యక్తిగతంగా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, వృద్ధికి సంబంధించిన భూమిగా ప్రదర్శిస్తానని మన్ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేయడంలో ఈ పర్యటన మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story