కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్

Punjab Appoints Sonu Sood As Brand Ambassador Of Covid Vaccination Drive.పంజాబ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్‌.

By Medi Samrat
Published on : 12 April 2021 9:10 AM IST

Sonu Sood as brand ambassador

సినీ నటుడు అనే కన్నా మానవతావాది గానే మనసులు దోచుకున్న సోనూ సూద్‌కి మరో అరుదైన గౌరవం లభించింది. సొంత రాష్ట్రం పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్ నియమితులయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్‌ని నియమిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో సోనూ ఇకపై ఈ పాలుపంచుకుంటారు. '' గొప్ప పరోపకారి, నటుడు సోనూ సూద్‌ని కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన మద్దతుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలి'' అని పంజాబ్ సీఎం అమరీందర్ ట్వీట్ చేశారు.

కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవడంతో పంజాబీలు అయిష్టంగా ఉన్నారని.. వారిని వ్యాక్సిన్ వేసుకునేలా సోనూ సూద్ ప్రభావితం చేయగలరని సీఎం ఆకాంక్షించారు. కరోనా సమయంలో వేలాది మంది వలస కార్మికులను సొంతూళ్లకు పంపడంలో సోనూ సూద్ ప్రముఖ పాత్ర వహించడం పై ఆయన ప్రశంసించారు. సోనూ సూద్‌ స్వస్థలం పంజాబ్‌లోని మోగా. ప్రస్తుతం పంజాబ్‌లో 3,294 కొత్త కేసులు నమోదు కాగా 58 మంది కరోనాతో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సోనూ సూద్ గత బుధవారంనాడు అమృత్ సర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో తెలియజేసే విధంగా సంజీవని అనే వ్యాక్సినేషన్ డ్రైవ్కి కూడా ఆయన అంబాసిడర్ గా ఉన్నారు.



Next Story