పంజాబ్‌లో ఆప్‌కు షాక్ తగిలింది. గతంలో మంత్రి పదవి నుంచి తప్పించబడిన ఖరార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తన రాజీనామాను త్వరగా ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్‌కు విజ్ఞప్తి చేశారు.
అన్మోల్ గగన్ మాన్ తన సోషల్ మీడియా ఖాతాలో నా గుండె బరువెక్కింది, నేను రాజకీయాలను వదిలివేయాలని నిర్ణయించుకున్నాను. ఎమ్మెల్యే పదవికి నేను చేసిన రాజీనామాను స్పీకర్ సాహెబ్ ఆమోదించాలి. పార్టీకి నా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
శిరోమణి అకాలీదళ్ ఖరార్ అభ్యర్థి రంజిత్ సింగ్ గిల్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన తరుణంలో అన్మోల్ గగన్ మాన్ రాజీనామా చర్చనీయాంశమైంది. గిల్ బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారనే చర్చ నడుస్తుంది.
అన్మోల్ గగన్ మాన్ గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు.. అయితే ఆప్ క్యాబినెట్‌లో మార్పులు చేయడంతో.. అన్మోల్ గగన్ మాన్‌ను ఆ పదవి నుండి తొలగించారు. ఆమె తన ప్రకటనల కారణంగా తరచూ వివాదాల్లో నిలిచేవారు.