నో పార్కింగ్‌లో బైక్ పెట్టాడ‌ని.. క్రేన్‌తో ఇలా ఎత్తేశారు

Pune Traffic Police officials tow bike with the owner sitting on it.ఒక్కొసారి ట్రాఫిక్ పోలీసులు చేసే ప‌నులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2021 3:31 AM GMT
నో పార్కింగ్‌లో బైక్ పెట్టాడ‌ని.. క్రేన్‌తో ఇలా ఎత్తేశారు

ఒక్కొసారి ట్రాఫిక్ పోలీసులు చేసే ప‌నులు చ‌ర్చ‌కు దారి తీస్తాయి. తాజాగా ఓ వాహ‌న‌దారుడు నో పార్కింగ్‌లో వాహ‌నాన్ని ఉంచాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్‌ను క్రేన్ సాయంతో వాహ‌నంలోకి ఎక్కించేందుకు య‌త్నించారు. వెంట‌నే వాహ‌న‌దారుడు అక్క‌డికి చేరుకుని బైక్‌పై కూర్చొన్నాడు. అయిన‌ప్ప‌టికి ట్రాఫిక్ పోలీసులు అలాగే బండిని అలాగే త‌మ వాహ‌నంలోకి ఎక్కించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పుణెలో జరిగింది.

పుణెలోని నానాపెఠ్ ప్రాంతంలో ఉమేష్ వాడేకర్ అనే ఓ వ్య‌క్తి రాంగ్ పార్కింగ్ చేశాడు. అంత‌లోనే అక్క‌డ‌కు వ‌చ్చిన ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్‌ను త‌మ వాహ‌నంలోకి ఎక్కించే య‌త్నం చేశారు. గ‌మ‌నించిన వాడేక‌ర్.. అక్క‌డికి వ‌చ్చి ఇప్పుడే పార్క్ చేశాన‌ని త‌న ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని వ‌దిలివేయాల‌ని ట్రాఫిక్ పోలీసుల‌ను బ‌తిమిలాడుకున్నాడు. అయిన‌ప్ప‌టికి వారు విన‌లేదు. దీంతో వాడేక‌ర్ త‌న బైక్‌పై కూర్చున్నాడు. అయినప్ప‌టికి వెన‌క్కి త‌గ్గ‌ని ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో అత‌డు బండిపై కూర్చొని ఉండ‌గానే.. అమాంతం పైకి లేపి త‌మ వాహ‌నంలోకి ఎక్కించారు. ప‌క్క‌న ఉన్న వారు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఫోటోలు, వీడియోలు తీశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో నెటీజ‌న్లు స‌ద‌రు ట్రాఫిక్ పోలీసుల‌పై మండిప‌డుతున్నారు.

దీనిపై వాడేక‌ర్ మాట్లాడుతూ.. రెండు నిమిషాల క్రితమే బైక్‌ను పార్క్ చేశానని, వెంటనే వెళ్తానని చెప్పిన పోలీసులు వినలేదన్నారు. రూ.460 జరిమానా విధించార‌న్నాడు. ప్ర‌స్తుతం త‌న వ‌ద్ద న‌గ‌దు లేద‌ని చెప్పినా.. ఇలా వాహ‌నాన్ని ఎక్కించార‌న్నాడు.

అనంత‌రం రాంగ్ పార్కింగ్ చేసినందుకు పోలీసుల‌కు క్ష‌మాప‌ణ చెప్పి జ‌రిమానా చెల్లించాడు వాడేక‌ర్‌. ఈ విష‌యం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. బైక్‌తో అత‌న్ని కూడా క్రేన్ స‌హాయంతో వ్యాన్‌లో ఎక్కించిన పోలీసు సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు.

Next Story
Share it