యూనివర్సిటీ హాస్టల్‌లో దారుణం.. 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.!
Private videos of 60 girls in Chandigarh University hostel leaked. పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఓ అమ్మాయి నీచానికి ఓడిగట్టింది. తన హాస్టల్‌లో ఉన్న 60 మంది అమ్మాయిల
By అంజి Published on 18 Sep 2022 6:12 AM GMTపంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఓ అమ్మాయి నీచానికి ఓడిగట్టింది. తన హాస్టల్‌లో ఉన్న 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను సీక్రెట్‌గా తీసి, వాటిని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపింది. దీంతో అతడు ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. విద్యార్థులు స్నానం చేస్తున్న క్లిప్‌లు ఆన్‌లైన్‌లో రావడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో యూనివర్సిటీలో కలకలం రేగింది. ఈ ఘటనతో హాస్టల్‌లోని అమ్మాయిలు షాక్‌కు గురయ్యారు. వీడియోలు లీక్ కావడంతో పది మంది విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. వీడియోల లీక్‌తో యూనివర్శిటీలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు దిగారు. క్యాంపస్‌కు వచ్చిన పోలీసుల వాహనాన్ని విద్యార్థినులు తగులబెట్టారు.
మరోవైపు ఇతర విద్యార్థుల అభ్యంతరకర వీడియోలను లీక్ చేశారనే ఆరోపణలపై చండీగఢ్ పోలీసులు ఆదివారం మొహాలీకి చెందిన మహిళా విద్యార్థిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం అర్థరాత్రి పెద్ద సంఖ్యలో విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఓ బాధిత విద్యార్థి కుప్పకూలిపోగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, నిందితురాలైన విద్యార్థిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రూపిందర్ కౌర్ తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హెచ్‌ఎస్ బైన్స్ స్పందిస్తూ.. చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దోషులను విడిచిపెట్టబోమని హామీ ఇచ్చారు.
స్నానాలు చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థి సంక్షేమ అధికారి.. ఎవరూ ఆత్మహత్యకు యత్నించలేదని చెప్పారు. ఈ విషయం సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు చెప్పామని అధికారి తెలిపారు. అయితే అలాంటి వీడియో ఏదీ లీక్ కాలేదని స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ అరవిందర్ సింగ్ కాంగ్ తెలిపారు. కానీ విద్యార్థులు సంతృప్తి చెందకపోవడంతో తాము పోలీసులను పిలిపించాము అని చెప్పారు. తదుపరి విచారణ జరుగుతోంది.