విపక్షాల అవిశ్వాస తీర్మానం శుభసూచకం: ప్రధాని నరేంద్ర మోదీ

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 6:26 PM IST
Prime Minister, No confidence motion, speech, Delhi,

విపక్షాల అవిశ్వాస తీర్మానం శుభసూచకం: ప్రధాని నరేంద్ర మోదీ

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలు మూడ్రోజులుగా ఫీల్డింగ్ చేస్తుంటే.. తమ వైపు నుంచి ఫోర్లు, సిక్స్‌లు పడ్డాయని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని ఆరోపించారు. అవిశ్వాసం పెట్టాలని దేవుడే విపక్షాలకు చెప్పాడని.. ఇలా పెట్టినందుకు విపక్ష సభ్యులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాత తీర్మానం తమకు శుభసూచకమని చెప్పారు ప్రధాని మోదీ. 2018లోనూ అవిశ్వాస తీర్మానం పెట్టారని.. కానీ ప్రతిపక్షాలకు వారికున్న సభ్యుల ఓట్లు కూడా పడలేదని విమర్శించారు. ఈసారి పెట్టిన అవిశ్వాసం కేంద్ర ప్రభుత్వంపై కాదని.. విపక్షాలపైనే అని చెప్పారు. 2024లో ఎన్డే అన్ని కార్డులు బద్దలు కొట్టనుందని దీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రజలకు కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని.. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అన్నారు. ఇక ప్రతిపక్షానికి అధికార దాహం పెరిగిపోయిందని.. పేదల భవిష్యుత్తు గురించి మాట్లాడటం లేదని అన్నారు. పేదల భవిష్యత్‌ కంటే విపక్షాలకు అధికారమే ముఖ్యమైందా అంటూ నిలదీశారు ప్రధాని నరేంద్ర మోదీ.

పార్లమెంట్‌లో మూడ్రోజులుగా సాగిన అవిశ్వాసంపై చర్చ ఆశ్చర్యం కలిగించింది అన్నారు. విపక్షాలు ఫీల్డింగ్ చేస్తుంటే..తమ వైపు నుంచి ఫోర్లు సిక్స్‌లు పడ్డాయని అన్నారు. వారు ప్రవేశపెట్టిన నో కాన్ఫిడెన్స్ నో బాల్ గా మిగిలిపోయిందన్నారు. ఐదేళ్లు సమయం ఇచ్చినా.. ప్రభుత్వంపై గట్టిగా పోరాడేందుకు విపక్షాలకు చేత కాలేదని అన్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో విఫలం అయ్యారని మోదీ అన్నారు. అవినీతికి తావు లేకుండా తమ పాలన సాగిందని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ పాలనలో దేశం ఎంతగా బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం అన్నారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

దేశంలో మంచి పనులు జరుగుతుంటే విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు ప్రధాని మోదీ. విపక్షాల వెనుక రహస్య శక్తులు ఉన్నాయని అన్నారు. అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో జీర్ణించుకుపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

Next Story