ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు.
By Srikanth Gundamalla Published on 27 July 2024 5:02 AM GMTఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆగస్టు23వ తేదీన ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే.. మోదీ ప్యటనకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇంకా స్పష్టతనివ్వలేదు.
కాగా.. గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కలిసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై చర్చించారు. మోదీ ఇటీవల రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్‌కు వెళ్తుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యాలో పర్యటించిన మోదీకి ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని అధ్యక్షుడు పుతిన్ అందజేశారు. ఇండియా-రష్యా 22వ వార్షిక సమావేశం సందర్భంగా ప్రధానిని రష్యాలో పర్యటించాలని పుతిన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా.. మూడు వారాల్లో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవాలని పుతిన్ సైన్యం లక్ష్యంగా పెట్టుకున్నది.
మూడు వారాల్లో ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవాలని పుతిన్ సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. యుద్ధం ఆపాలంటూ పలు దేశాలు సూచిస్తున్నాయి. కానీ.. చర్చల కోసం ముందుకు రావడం లేదు. మరి ప్రధాని నరేంద్ర మోదీ చర్చలకు ఆహ్వానిస్తారా? ఎలాంటి విషయాలను చర్చించబోతున్నారనేది ఆసక్తి కొనసాగుతోంది.