దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  25 Feb 2024 4:45 AM GMT
prime minister modi, cable bridge, gujarat,

 దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన కేబుల్‌ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత దానిని జాతికి అంకితం చేశారు. ఈ కేబుల్‌ బ్రిడ్జికి 'సుదర్శన్ సేతు' అని నామకరణం చేశారు.

గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ఈ కేబుల్‌ బ్రడ్జి నిర్మాణానికి 2017లోనే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఏడేళ్ల పాటు దీని నిర్మాణం కొనసాగింది. ఓఖా ప్రధాన భూభాగాన్ని ఈ వంతెనను రూ.979 కోట్ల రూపాయలతో నిర్మించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు, వెడెల్సు 27.20 మీటర్లు ఉంటుంది. సుదర్శన్ సేతు బ్రిడ్జిని ప్రారంభించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ద్వారక ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఇక ఆదివారం కూడా ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని తొలి ఎయిమ్స్‌ ఆస్పత్రిని మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏపీ, పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో ఎయిమ్స్‌ ఆస్పత్రులను కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను రూ.6,300 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఇక గుజరాత్‌లో సాయంత్రం నిర్వహించనున్న రోడ్‌షోలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.

Next Story