దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

శ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  12 Jan 2024 5:13 PM IST
prime minister modi,  india, biggest bridge,

దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రారంభించారు. సముద్రంపై నిర్మించిన వంతెనల్లో ఇదే అతిపెద్దది. 'ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌' వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. అయితే.. ఈ వంతెనను సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవాశేవాను కలుపుతూ నిర్మించారు.

దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జి అయిన దీనికి.. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి గౌరవార్తం 'అటల్‌సేతు' అని పేరు పెట్టారు. ఈ వంతెనను రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లైన్లుగా నిర్మించారు. ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతోంది. అయితే.. కొత్తగా నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రయాణాని చేరుకోవచ్చు. ఇక ఈ అట్‌ సేతు బ్రిడ్జి మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లకు పైగా బ్రిడ్జి పూర్తిగా అరేబియా సముద్రంపైనే ఉంటుంది. ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకునేలా ఈ వంతెనను నిర్మించారు. ట్టణ రవాణా మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని పటిష్టం చేసి ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని సులభతరం చేయాలనే ప్రధాని విజన్‌లో భాగంగా ఈ వంతెన నిర్మాణం జరిగింది. 2016 డిసెంబర్‌లో ఈ బ్రిడ్జికి మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా గోవా, పూణె, దక్షిమ భారతదేశానికి తక్కువ సమయంలో ప్రయాణం చేయవచ్చు. ఇక ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింగ్‌ ద్వారా నాలుగు చక్రాల వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలు ఉంటుంది. బైకులు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లకు ఈ బ్రిడ్జిపైకి వచ్చేందుకు అనుమతి లేదు. ఇక ప్రాజెక్టు కారణంగా ఆవాసం కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం పరిహారం అందిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించడానికి ముందు నాసిక్‌లో మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. రెండు కిలోమీటర్లకు పైగా 35 నిమిషాల పాటు రోడ్‌షో కొనసాగింది. పలు ఆలయాల్లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.


Next Story