పండుగ వేళ సాంప్రదాయ పంచెకట్టులో ప్రధాని మోదీ.. ట్రెండింగ్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 3:05 PM IST
prime minister, modi, pongal, delhi,

పండుగ వేళ సాంప్రదాయ పంచెకట్టులో ప్రధాని మోదీ.. ట్రెండింగ్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నగరాల నుంచి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకొనేందుకు జనాలు తమతమ స్వగ్రామాలకు చేరుకున్నాయి. దాంతో నగరం ఖాళీ అవ్వడంతో పాటు.. గ్రామాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకొంటారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పండుగ వేళ ప్రధాని నరేంద్ర మోదీ తన మార్క్‌ను చూపించారు. సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టుతో కనిపించారు. ఆయన పంచెకట్టులో కనిపించడంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్ నివాసంలో జరిగిన ఈ సంక్రాంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. సంక్రాంతి అంటేనే సాంప్రదాయ పండుగ. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సాంప్రదాయ పంచెకట్టులో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. పండుగ సందర్భంగా కట్టెల పొయ్యిపై పాయసం కూడా వండారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం సాంప్రదాయాల ప్రకారం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. సంక్రాంతి సంబరాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ పంచెకట్టులో పాయసం వండుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


Next Story