మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ బీమా సఖి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుంచి 70 ఏళ్ల వయస్సున మహిళలు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో భాగంగా మూడేళ్లపాటు మహిళలకు బీమా, ఆర్థిక అంశాలకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు శిక్షణ ఇస్తారు. ఈ పథకంలో చేరిన బీమా సఖులకు స్టైఫండ్‌గా ప్రతి నెలా రూ.7 వేలు అందిస్తారు. రెండో సంవత్సరం రూ.వెయ్యి తగ్గించి రూ.6 వేల చొప్పున అందజేస్తారు.
మూడో సంవత్సరంలో ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తారు. అంతేకాదు ప్రత్యేకంగా రూ.21 వేలు అందుతుంది. బీమా లక్ష్యాలను పూర్తి చేసిన వారికి ప్రత్యేక కమీషన్ లభిస్తుంది. బీమా సఖి యోజన పథకం కింద ఏడాదిలో లక్ష మంది మహిళలను ఎల్‌ఐసీ ఏజెంట్లుగా ఉపాధి కల్పిస్తారు. మూడు సంవత్సరాల్లో 2 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశం కల్పిస్తారు.