ఇండియా కూటమిని గెలిపిస్తే మళ్లీ చీకటి కమ్ముకుంటుంది: ప్రధాని మోదీ
ఉత్తర్ ప్రదేశ్‌లోని స్రవస్థిలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 22 May 2024 11:45 AM GMTఇండియా కూటమిని గెలిపిస్తే మళ్లీ చీకటి కమ్ముకుంటుంది: ప్రధాని మోదీ
ఉత్తర్ ప్రదేశ్‌లోని స్రవస్థిలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రచారం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు.
విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతీ వివక్షతో పాటు బంధుప్రీతి వంటి వ్యాధులు ఉన్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. క్యాన్సర్ కంటేఈ ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందితే దేశమంతా నాశనం చేస్తాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందందని అన్నారు. దేశంలో 4 కోట్ల మంది పేదలకు తాము ఇళ్లు ఇచ్చామని చెప్పారు. ఒకవేళ ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని ఆరోపించారు. విపక్షాలు గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన వాటిని లాక్కుంటారని అన్నారు. ఆ తర్వాత వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచేస్తుందని అన్నారు. అంతేకాదు.. తాను ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్‌ధన్ ఖాతాలను మూసివేసి ఆ డబ్బులను కూడా లాక్కుంటారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ కనెక్షన్ అందించిందని చెప్పారు. అయితే.. ఇండియా కూటమికి అధికారమిస్తే మరోసారి కరెంట్ కట్ చేసీ.. మళ్లీ చీకటి రోజులను తీసుకొస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల కోసం 60 ఏళ్ల పాటు ఏమీ చేయని వారు.. మోదీని నిలువరించేందుకు ఏకం అయ్యేందుకు ఏకమయ్యారంటూ ఎద్దేవా చేశారు. యూపీలో అదే ప్లాఫ్ సినిమాతో అదే పాత క్యారెక్టర్లు, పాత డైలాగ్స్‌తో ఇద్దరు వారసత్వ నేతలు బయల్దేరని విమర్శలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించబోవు అంటూ రాహుల్‌గాంధీ, అఖిల్ యాదవ్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.