మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఇక్కడ అధికార బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ పడుతోంది.
By అంజి Published on 20 Nov 2024 5:12 AM GMTమహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఇక్కడ అధికార బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ పడుతోంది. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి బలమైన పునరాగమనం కోసం ఆశిస్తోంది. బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోరి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు నాగ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. ముంబైలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావు, నటి గౌతమి కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని పోలింగ్ కేంద్రంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ఓటు వేశారు.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారి తెలిపారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోటీలో ఉన్న 4,136 మంది అభ్యర్థులు ఉన్నారు. 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహాయుతి కూటమిలో బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. విపక్షాల ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను, శివసేన (యూబీటీ) 95 మంది, ఎన్సీపీ (ఎస్పీ) 86 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM)తో సహా చిన్న పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి, బీఎస్‌పీ 237 మంది అభ్యర్థులను, ఎంఐఎం 17 మంది అభ్యర్థులను 288 మంది సభ్యులు కలిగి ఉంది. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి ప్రముఖ నాయకులు తమ అభ్యర్థులకు ఓట్లను రాబట్టేందుకు రాష్ట్రానికి వచ్చారు.