విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరు అయింది. ఆరోగ్య కారణాలతో బాధపడుతున్న వరవరరావుకు ఎట్టకేలకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీమా కొరేగావ్ కేసులో అరెస్టైన వరవరరావు.. ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నారు. వరవరరావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం సుముఖత తెలిపింది.
విరసం నేత వరవరరావు వయసు, ఆరోగ్యం పరిగణలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. బెయిల్ ఇవ్వాలని వరవరరావు భార్య వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. మనమంతా మనుషులమన్న విషయం మరిచిపోకూడదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
అనారోగ్య పరిస్థితుల దృష్యా ముంబయి నానావతి ఆస్పత్రిలో వరవరరావు చికిత్సపొందుతున్నారు. ఇందుకు సంబంధించి చికిత్స ఖర్చులు తామే భరిస్తామని గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.