PM-విద్యాలక్ష్మి పథకం.. గ్యారెంటర్ లేకుండానే ల‌క్ష‌ల్లో రుణాలు.. పూర్తి వివ‌రాలివే..

ప్రతిభ గ‌ల‌ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకానికి ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం తెలిపింది

By Medi Samrat  Published on  6 Nov 2024 2:45 PM GMT
PM-విద్యాలక్ష్మి పథకం.. గ్యారెంటర్ లేకుండానే ల‌క్ష‌ల్లో రుణాలు.. పూర్తి వివ‌రాలివే..

ప్రతిభ గ‌ల‌ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకానికి ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన ఉన్నత విద్యను పొందేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతదేశంలోని యువతకు సహాయం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పథకం కిందకు వస్తారు. ఈ పథకం పూర్తిగా ఉచిత విద్యా రుణాలకు హామీనిస్తుంది. ఇది ప‌థ‌కం చాలా స్టూడెంట్ ప్రెండ్లీగా రూపొందించబడింది. డిజిటల్ అప్లికేషన్ ప్రక్రియ ద్వారా సరళీకృతం చేయబడింది. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఈ పథకం ప్రయోజనాలను పొందగలరు.

ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు విద్యార్థులు ఆన్‌లైన్ పోర్టల్ vidyalakshmi.co.inని సందర్శించడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు మీరు 10వ తరగతిలో నమోదు చేసినట్లుగా మీ పేరు, మొబైల్ నంబర్, చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID ద్వారా నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలను పూరించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. EMIలో రుణాన్ని లెక్కించే సదుపాయం కూడా వెబ్‌సైట్‌లో అందించబడింది.

ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలోని 860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే ప్రతిభావంతులైన విద్యార్థులకు రుణ ఏర్పాటును అందించనున్నారు. ఈ పథకం కింద కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4.5 లక్షలు ఉన్న విద్యార్థులకు రుణంపై వడ్డీ నుండి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల ఉన్న విద్యార్థులకు కేవలం 3 శాతం వడ్డీకే రూ.10 లక్షల వరకూ రుణాలు అందజేస్తారు. గ్యారెంటర్ లేకుండా ఈ రుణం అందించబడుతుంది. అంటే పీఎం విద్యాలక్ష్మీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకు రుణం లభించనుంది. ఈ రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యతకు దూరం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.

NIRF ర్యాంకింగ్స్ ద్వారా నిర్ణయించబడిన దేశంలోని అత్యుత్తమ నాణ్యత గల ఉన్నత విద్యా సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో వివిధ కేటగిరీల కింద NIRFలో టాప్ 100లో ర్యాంక్ పొందిన అన్ని HEIలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.

Next Story