నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది.. మనం చాలా జాగ్రత్త పడాలి: మోదీ

PM Narendra Modi's Mann ki Baat address. భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వాన నీటి సంరక్షణ గురించి ఆయన

By Medi Samrat  Published on  28 Feb 2021 1:17 PM GMT
PM Narendra Modis Mann ki Baat address
భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వాన నీటి సంరక్షణ గురించి ఆయన మాట్లాడారు. రాబోయే రోజులు అత్యంత కఠినంగా ఉంటాయని, భవిష్యత్తులో చాలా మందికి నీరు అందని పరిస్థితులు ఏర్పడతాయని మోదీ అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇప్పటి నుంచే జల సంరక్షణ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా వాన నీటిని ఒడిసిపట్టాలని.. దేశంలో జూన్ నుంచి వర్షాలు మొదలవుతాయని, ఆ లోపే వాన నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను మొదలు పెట్టాలని సూచించారు. కుంటలు, చెరువులు, బావుల వంటి జలవనరులను శుభ్రం చేయడం, వాటి పూడిక తీయడం వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వాన నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.


కేంద్ర జల శక్తి శాఖ 'పడిన చోటే.. పడిన వెంటనే.. వాన నీటిని ఒడిసి పడదాం (క్యాచ్ ద రెయిన్)' అనే నినాదంతో ఓ మంచి కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతోందన్నారు. ఇంకుడు గుంతలను బాగు చేయాలని, జలవనరుల్లోకి వాన నీరు వెళ్లే మార్గాలను శభ్రం చేయాలని ప్రధాని సూచించారు.

హైదరాబాద్ కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని ప్రస్తావించారు భారత ప్రధాని. ''ఓ రోజు వెంకట్ రెడ్డికి స్నేహితుడైన ఓ డాక్టర్.. విటమిన్ డీ లోపంతో ఎలాంటి జబ్బులు వస్తున్నాయో, దానితో ఉన్న ప్రమాదమేంటో వెంకట్ రెడ్డికి చెప్పారు. అప్పుడే రైతు అయిన వెంకట్ రెడ్డి.. ఆ సమస్యను ఎలా తీర్చాలని ఆలోచించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి విటమిన్ డీ కలిగిన వరి, గోధుమలను ఆయన పండించారు. ఈ నెలలోనే ఆయన పంటకు జెనీవాలోని ప్రపంచ మేధో హక్కుల సంస్థ.. పేటెంట్ హక్కులు కూడా ఇచ్చింది. అలాంటి వ్యక్తికి గత ఏడాది పద్మ శ్రీ పురస్కారం ఇవ్వడం మా ప్రభుత్వానికి దక్కిన గౌరవం'' అని చెప్పుకొచ్చారు.


Next Story