దేశ‌ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాని మోదీ

PM Narendra Modi top leaders extend Holi greetings to people.దేశ వ్యాప్తంగా హోలీ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 9:51 AM IST
దేశ‌ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాని మోదీ

దేశ వ్యాప్తంగా హోలీ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

ఇక హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజ‌లకు సీఎం కేసీఆర్‌ హోలీ పండుగ శుభా‌కాం‌క్షలు తెలి‌పారు. అన్ని వర్గాల ప్రజలు కలి‌సి‌మె‌లిసి సంతో‌షంగా సాగా‌లనే సందే‌శాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొ‌న్నారు. ప్రకృతి మెచ్చే రంగు‌లతో హోలీని ఆనం‌దో‌త్సా‌హా‌లతో జరు‌పు‌కో‌వా‌లని సీఎం సూచించారు.

''ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు' అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

హోలీ పండుగకంటే ముందు పలు కూడళ్లలో కామదహనం చేశారు. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడిని..ఈశ్వరుడు తన మూడో కన్ను తెరిచి ఫాల్గుణ పౌర్ణమి నాడే భస్మం చేశాడని శివపురాణం పేర్కొంటోంది. హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటల్లో వేసినప్పుడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు తన మహిహలతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. హోలికా ఆ మంటల్లో దహనమౌతుందని దీనికి ప్రతికగా హోలీ పండుగ కంటే ముందు రోజు హోలికా బొమ్మను మంటల్లో వేసి కాముడి దహనంగా జరుపుకుంటారని చెబుతుంటారు.

Next Story