యోగా శిక్షణ కోసం 'ఎమ్-యోగా' యాప్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Narendra Modi launches M-Yoga App.నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2021 9:27 AM GMTనేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 'ఎమ్-యోగా(mYoga)' పేరిట ఓ సరికొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్‌లో యోగా శిక్షణకు సంబంధించిన వీడియోలు వివిధ బాషల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ యాప్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని.. యోగాను విశ్వవాప్తం చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్ఓ) సహకారంతో భారతదేశం మరో ముఖ్యమైన అడుగు వేసింది. రెండూ కలిసి ఎమ్-యోగా యాప్‌ను తీసుకువచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ బాషల్లో యోగా శిక్షణ వీడియోలు దీని ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాచీన శాస్త్రాల కలయికకు ఈయాప్ ఒక ఉదాహారణగా నిలువనుందని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యాప్‌ను గతంలోనే రూపొందించినా కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాంఛింగ్ కార్యక్రమం టీవీల్లో ప్రసారం కాలేదు.
अब विश्व को, M-Yoga ऐप की शक्ति मिलने जा रही है।
— PMO India (@PMOIndia) June 21, 2021
इस ऐप में कॉमन योग प्रोटोकॉल के आधार पर योग प्रशिक्षण के कई विडियोज दुनिया की अलग अलग भाषाओं में उपलब्ध होंगे: PM @narendramodi #YogaDay
'ఎమ్ యోగా' యాప్‌ను 12 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైనా ఈ యాప్ సాయంతో యోగాసానాలు వేయొచ్చు. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన భాషల్లో అందుబాటులోకి రానుంది. అలాగే వినియోగదారుల గోప్యతకు ఈ యాప్ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు, 20, నిమిషాలు, 45 నిమిషాలు ఇలా మీరు ఎంత సమయం యోగా చేయాలనుకుంటే అంత సమయాన్ని ఎంచుకుంటే.. అందుకు తగ్గట్లే వీడియోలు ప్లే అవుతాయి.