ప్ర‌ధాని మోదీ ట్విట‌ర్ అకౌంట్ హ్యాక్‌.. హ్యాక‌ర్ల ఏమ‌ని ట్వీట్ చేశారంటే..?

PM Modi's Twitter account hacked now restored.ఇటీవల‌ పలువురు ప్రముఖుల సోష‌ల్ మీడియా అకౌంట్‌లు హ్యాక్ గురి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 2:14 AM GMT
ప్ర‌ధాని మోదీ ట్విట‌ర్ అకౌంట్ హ్యాక్‌.. హ్యాక‌ర్ల ఏమ‌ని ట్వీట్ చేశారంటే..?

ఇటీవల‌ పలువురు ప్రముఖుల సోష‌ల్ మీడియా అకౌంట్‌లు హ్యాక్ కు గురి కాగా.. తాజాగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ట్విట‌ర్ ఖాతా కొద్ది స‌మ‌యం హ్యాక్ కు గురైంది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని కార్యాల‌యం దృవీక‌రించింది. ఆదివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని ట్విట‌ర్ అకౌంట్‌ను హ్యాక‌ర్లు హ్యాక్ చేయ‌డం జ‌రిగింది. భార‌త్‌లో బిట్‌కాయిన్‌ను లీగ‌ల్ చేశార‌ని, ప్ర‌భుత్వం 500 బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి ప్ర‌జ‌ల‌కు పంచుతుంద‌ని లింక్‌లు, పోస్టుల‌ను ప్ర‌ధాని అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు గుర్తించిన పీఎంవో అధికారులు వెంట‌నే ట్విట‌ర్ దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లారు. అనంత‌రం ట్విట‌ర్.. ప్ర‌ధాని మోదీ అకౌంట్‌ను రీ స్టోర్ చేసింది. కాగా.. ఖాతా హ్యాక్ అయిన సమయంలో ఏదైనా మెసేజ్ వస్తే వదిలేయాలని పీఎంవో అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

హ్యాక‌ర్లు పెట్టిన పోస్టు ఇదే..

భార‌త ప్ర‌భుత్వం బిట్‌కాయిన్‌ను లీగ‌ల్ చేసింది. ప్ర‌భుత్వం 500 బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి ప్ర‌జ‌ల‌కు పంచుతుంది. వెంట‌నే ఈ లింక్ల్‌ల‌పై క్లిక్ చేయండి.


ఈ ట్వీట్‌తో అప్రమత్తమైన పీఎంఓ కార్యాలయం వెంట‌నే స్పందించింది. ప్ర‌ధాని అకౌంట్ హ్యాక్ అయినట్టు అధికారికంగా ప్రకటించింది. ఆదివారం తెల్ల‌వారుజామ‌న 2 గంటల ప్రాంతంలో అకౌంట్‌ హ్యాక్ అయితే.. 3 గంటలకు పీఎంఓ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. హ్యాక్ అయిన విషయాన్ని ట్విట‌ర్‌ కు సమాచారం అందించినట్టు పీఎంవో కార్యాలయం తెలిపింది. ట్విట‌ర్‌ వెంటనే ప్రధాని అకౌంట్‌కు అదనపు భద్రత కల్పించింది. కాగా.. మోదీ ట్విట‌ర్ అకౌంట్ హ్యాక్ కావడం ఇది రెండవసారి. గతంలో క్రిప్టోకరెన్సీ రూపంలో మోదీ సహాయనిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ట్వీట్ చేశారు.

Next Story