పెరిగిన ప్రధాని మోదీ ఆస్తి.. ఎన్ని కోట్లో తెలుసా?

PM Modi’s total assets rise by Rs 26 lakh to Rs 2.23 crore. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రూ.2.23 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. చాలా వరకు ఈ మొత్తం బ్యాంక్‌ డిపాజిట్ల

By అంజి  Published on  9 Aug 2022 4:07 PM IST
పెరిగిన ప్రధాని మోదీ ఆస్తి.. ఎన్ని కోట్లో తెలుసా?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రూ.2.23 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. చాలా వరకు ఈ మొత్తం బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో ఉంది. ప్రధాని మోదీ పేరు మీద ఎలాంటి స్థిరాస్తి లేదు. గాంధీనగర్‌లో ఉన్న కొంత స్థలాన్ని ఆయన దానం చేశారు. ఇక బాండ్‌, షేర్‌, మ్యుచవల్‌ ఫండ్స్‌లో ఆయనకు ఎలాంటి పెట్టుబడులు లేవు. సొంత వెహికల్‌ కూడా లేదు. అయితే మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.1.73 లక్షలు. ఈ ఏడాది మార్చి 31న ఇచ్చిన డిక్లరేషన్‌ ఆధారంగా ఈ వివరాలు తెలిశాయి. గడిచిన సంవత్సర కాలంలో మోదీ ఆస్తులు రూ.26.13 లక్షలు పెరిగినట్లు తెలుస్తోంది.

గుజ‌రాత్ ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2002 అక్టోబర్‌లో మోదీ ఓ రెసిడెన్షియ‌ల్ ప్లాట్‌ను ముగ్గురితో క‌లిసి కొన్నారు. అయితే ఆ ఫ్లాట్‌ను డొనెట్‌ చేసిన‌ట్లు తెలుస్తోంది. మార్చి 31, 2021 నాటికి ఉన్న రూ. 1.1 కోట్ల విలువైన స్థిరాస్తులు ఇప్పుడు ప్రధాని మోదీకి లేవు. ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం.. మార్చి 31, 2022 నాటికి అతని ఆస్తులు మొత్తం రూ. 2,23,82,504. మార్చి 31, 2022 నాటికి ప్రధాని చేతిలో ఉన్న నగదు రూ. 35,250. పోస్టాఫీసులో అతని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ రూ. 9,05,105 .

ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మార్చి 31, 2022 నాటికి చ‌రాస్థి 2.54 కోట్లు కాగా, స్థిరాస్థి 2.97 కోట్లు అని డిక్ల‌రేష‌న్ ద్వారా తేలింది. 29 మంది క్యాబినెట్ మంత్రుల్లో .. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, జ్యోతిరాధిత్య సింథియా, ఆర్కే సింగ్‌, హ‌ర్‌దీప్ సింగ్ పురి, పురుషోత్తం రూపాలా, జీ కిష‌న్ రెడ్డిలు త‌మ ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గత ఆర్థిక సంవత్సరంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసి, జూలైలో పదవి నుంచి వైదొలిగిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తన ఆస్తులను ప్రకటించారు.

Next Story