ఈ నెల 11 రక్షా బంధన్ పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తానీ మహిళ ఖమర్ మోసిన్ షేక్ రాఖీని పంపారు. సోదరుడు మోదీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశా భావం వ్యక్తం చేస్తూ ఆమె ఒక లేఖ రాశారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకున్నారు. ఈ సారి మోదీని కలవాలని అనుకుంటున్నానని, మోదీ తనను ఢిల్లీకి పిలుస్తారని ఆశిస్తున్నానని, అందుకు తాను రెడీగా ఉన్నానని చెప్పారు. తన చేతులతో స్వయంగా రాఖీ తయారు చేశానన్నారు.
"ఎలాంటి సందేహం లేదు. మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారు. అతను ఆ పదవికి అర్హుడు. ఎందుకంటే మోదీకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతిసారీ మోదీ భారతదేశానికి ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నాను" అని ఖమర్ మోసిన్ లేఖలో పేర్కొన్నారు. షేక్ ప్రతి సంవత్సరం మోడీకి రాఖీ, రక్షా బంధన్ కార్డును పంపుతున్నారు. షేక్ ఆమె వివాహం తర్వాత పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చారు. అప్పటి నుండి ఆమె భారత్‌లోనే నివసిస్తున్నారు. తాను 24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నానని మోసిన్ షేక్ తెలిపింది. మోదీ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పుడు.. తొలిసారిగా రాఖీ కట్టినట్టు ఆమె వెల్లడించారు. చెప్పారు.