మోదీ తల్లికి కరోనా వ్యాక్సిన్

PM Modi's mother receives first dose of Covid-19 vaccine. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

By Medi Samrat  Published on  11 March 2021 10:52 AM GMT
PM Modis mother receives first dose of Covid-19 vaccine

భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆమెకు వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమె వయసు వంద సంవత్సరాలు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. తన తల్లికి కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చారని.. ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని.. తమ చుట్టుపక్కల వారిని కరోనా వ్యాక్సిన్ కోసం ప్రోత్సహించాలని కోరారు.


నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ప్రధాని ఫొటోను తొలగించాలని నిర్ణయించింది. ఈ సర్టిఫికెట్లపై మోదీ ఫొటోను ప్రచురించి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు చేసింది. దీంతో మోదీ ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖను సీఈసీ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో మోదీ ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.


Next Story