భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా.. ఎవరికీ చెప్పకుండా సెంట్రల్ విస్టా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా, సెక్యూరిటీ లేకుండానే ఆయన అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8.45 గంటలకు సందర్శించి గంట సేపు గడిపారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు సెంట్రల్ విస్టాను కలిపేందుకు చేపట్టిన ప్రాజెక్టు ఈ ఏడాది నవంబర్ కల్లా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 8:45 గంటల సమయంలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ స్థలంలో దాదాపు ఒక గంట సేపు గడిపారు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.అతని సందర్శనకు సంబంధించి ముందస్తు సమాచారం లేదు అని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఎటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా ఆయన వెళ్లారు.
డిసెంబర్ 10, 2020 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, క్యాబినెట్ మంత్రులు మరియు వివిధ దేశాల రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే కొత్త భవనం 2022 నాటికి పూర్తవుతుంది. డిసెంబర్ 2022 సెషన్ కొత్త భవనంలో జరగొచ్చని భావిస్తూ ఉన్నారు.