ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. ప్రధాని మోదీ పిలుపు

PM Modi urges people to strengthen har ghar tiranga movement hoist and display tricolour at home between aug 13-15. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

By అంజి  Published on  22 July 2022 2:29 PM IST
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. ప్రధాని మోదీ పిలుపు

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్రం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని లేదా ప్రదర్శించడం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చేయడం ద్వారా 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉద్యమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు.

త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారితీసిన అధికారిక సమాచార వివరాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆవిష్కరించిన తొలి త్రివర్ణ పతాకం చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం మన జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు.



Next Story