కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ యొక్క ఆవిర్భావం, వ్యాప్తిపై దేశంలోని పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారు. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 213 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 57 కేసులతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర (54 కేసులు), తెలంగాణ (24 కేసులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను Omicron గురించి అప్రమత్తం చేసింది. ఈ నేఫథ్యంలో దేశంలోని పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుత శాస్త్రీయ ఆధారాల ఆధారంగా.. ఓమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. స్థానిక మరియు జిల్లా స్థాయిలో ఎక్కువ దూరదృష్టి, డేటా విశ్లేషణ, కంటోన్మెంట్ ఏరియాలు ఏర్పరచడం మరియు కఠినమైన, సత్వర నియంత్రణ చర్యలు అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో 57,05,039 వ్యాక్సిన్ డోస్‌ల పంపిణీ జరిగింది. దీంతో భారత్ లో COVID-19 టీకా కవరేజీ 138.96 కోట్లను అధిగమించింది.