యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అల‌వ‌డుతుంది : ప్ర‌ధాని మోదీ

PM Modi Speech in International Yoga Day 2022.యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అల‌వ‌డుతుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 3:19 AM GMT
యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అల‌వ‌డుతుంది : ప్ర‌ధాని మోదీ

యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అల‌వ‌డుతుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా క‌ర్ణాట‌కలోని మైసూరులో నిర్వ‌హించిన కార్యక్ర‌మంలో ప్ర‌ధాని పాల్గొని యోగాస‌నాలు వేశారు. అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ.. యోగాను గుర్తించినందుకు ఐరాస‌(ఐక్య‌రాజ్య స‌మితి) స‌హా ప్ర‌పంచ‌దేశాలకు ప్ర‌ధాని ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. యోగా అనేది ఏ ఒక్క‌రికో చెందిన‌దికాద‌ని, అంద‌రిద‌ని అన్నారు. యోగా చేయ‌డం వ‌ల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుంద‌ని చెప్పారు.

కొన్ని నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందని తెలిపారు. యోగా దినోత్సవం అనేది ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అని అన్నారు. ఒక‌ప్పుడు ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా క‌నిపించేంద‌ని, ఇప్పుడు ప్ర‌పంచం న‌లుమూల‌లా విస్త‌రించింద‌ని చెప్పారు. కరోనా విపత్తు సమయంలోనూ యోగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. సమాజంలో శాంతిని యోగా నెలకొల్పుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంద‌ని చెప్పారు. యోగా సందేశాన్ని మాన‌వాళి మొత్తానికి చేర‌వేయాల‌ని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జ‌రుగుతున్నాయి. 'యోగా ఫర్ హ్యుమానిటీ' నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొని, యోగా ఆసనాలు వేశారు.

Next Story