కరోనా.. ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన మహమ్మారి. ఈ మహమ్మారికి చెక్ పెట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. ఈ విషయమై చాలా దేశాలు సత్ఫలితాలను సాధించాయనే చెప్పాలి. అయితే ఈ మహమ్మారిని పారదోలడం కోసం భారత్‌లో కూడా మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఇప్పడు దేశం అంతటా డ్రై రన్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పనితీరుపై ఆర్జేడీ మరోసారి అనుమానం వ్యక్తం చేసింది. ఆర్జేడీ ముఖ్య నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై ప్రజలకు నమ్మకం కుదరాలంటే దేశంలో తొలి టీకాను ప్రధాని నరేంద్రమోదీ వేయించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ టీకా వేయించుకున్న తర్వాతనే తాము కూడా టీకా తీసుకుంటామని తేజ్‌ప్రతాప్ పేర్కొన్నారు.