అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రధాన నరేంద్ర మోదీ అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  18 Dec 2023 8:31 AM GMT
pm modi, inaugurate, meditation centre, varanasi,

అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రధాన నరేంద్ర మోదీ అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. వారణాసిలోని సర్వవేద్‌ మహామందిర్‌లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. ఏడు అంతస్తుల్లో నిర్మించిన ఈ ధ్యాన మందిరంలో 20,000 మంది ధ్యానం చేసుకునేలా చేశారు.

ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను మంత్రముగ్ధుడను అయ్యానని చెప్పారు మోదీ. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీత, మహాభారతం వంటి దైవిక బోధనలను మహామందిర్‌ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయడం చూశానని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అసవరం ఉందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. కాశీలో గడిపిన ప్రతిక్షణం మరిచిపోలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాశీ అంటే అభివృద్ధికి పర్యాయపదంగా మారిందని చెప్పారు. ఇక సాధువుల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి, నవ నిర్మాణపరంగా కొత్త రికార్డులు సృష్టించారని కొనియాడారు. సర్వదేవ్‌ మహామందిర్‌ దీనికి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.

ధ్యానమందిరాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన ప్రదాని మోదీకి అంతకుముందు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం యోగి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదివారం, సోమ వారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.


Next Story