ప్ర‌ధాని మోదీకి భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారం

PM Modi Honoured With Bhutan's Highest Civilian Award.భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మ‌రో అరుదైన గౌర‌వం ల‌భించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2021 7:40 AM GMT
ప్ర‌ధాని మోదీకి భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారం

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మ‌రో అరుదైన గౌర‌వం ల‌భించింది. మోదీకి భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన 'న‌డాగ్ పెల్ గి ఖొర్లో తో స‌త్క‌రించింది. భూటాన్ జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ అవార్డు ప్ర‌టించింది. ఈ మేర‌కు ఆదేశ‌ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఇవ్వాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్ చుక్ సూచించారని తెలిపింది. భూటాన్ పౌర‌పుర‌స్కారాన్ని అందుకోవ‌డానికి మోదీ అర్హుడ‌ని చెప్పింది.

భూటాన్ కు అన్ని విధాలుగా, అన్ని సమయాల్లో ప్రధాని మోదీ అందిస్తున్న సాయాన్ని తమ రాజు ప్రధానంగా ప్రస్తావించారని తెలిపింది. భూటాన్ కు కొన్నేళ్లుగా మోదీ ఎంతో సాయం చేశారని.. ముఖ్యంగా క‌రోనా క‌ష్ట‌కాలంలో మోదీ అందించిన మ‌ద్ద‌తుకు వెల‌క‌ట్టలేనిద‌ని కొనియాడింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి మోదీ అత్యంత అర్హులని చెప్పింది. తమ దేశ ప్రజలందరి తరపున మోదీకి శుభాకాంక్షలు చెబుతున్నామ‌ని.. ఈ అవార్డు అందుకునేందుకు మోదీ రాక కోసంఎదురుచూస్తున్న‌ట్లు తెలిపింది. కాగా.. 2008లో ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని భూటాన్ నెలకొల్పింది. ఇంత వరకు ఏ విదేశీయుడికి ఈ పురస్కారాన్ని భూటాన్ ఇవ్వలేదు.

. ఇక ఇప్ప‌టికే సౌదీ అరేబియా, అఫ్గానిస్థాన్ దేశాలు ప్ర‌ధాని మోదీని త‌మ దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాల‌తో స‌త్క‌రించాయి.

Next Story