నేడే పీఎం ఈ-డ్రైవ్‌ పథకం ప్రారంభం.. ఈ- వెహికల్స్‌కు భారీ రాయితీ

దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పీఎం ఈ-డ్రైవ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

By అంజి  Published on  1 Oct 2024 9:53 AM IST
PM E-DRIVE, Central Govt, EV subsidy scheme

నేడే పీఎం ఈ-డ్రైవ్‌ పథకం ప్రారంభం.. ఈ- వెహికల్స్‌కు భారీ రాయితీ

దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పీఎం ఈ-డ్రైవ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రెండేళ్ల పాటు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. E-2Ws, E-3Ws, E- అంబులెన్స్‌లు, E- ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్లు, ఛార్జింగ్‌ వసతులు, E - బస్సుల కోసం మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. నేటి నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.

ఢిల్లీలో నేడు జరగనున్న ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆ శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొననున్నారు. ఈ పథకం అక్టోబర్ 1, 2024 నుండి మార్చి 31, 2026 వరకు అమలు చేయబడుతుందని గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు, త్రీవీలర్లు, ఈ - అంబులెన్స్‌లు, ఈ - ట్రక్కులకే కేంద్రం రాయితీ ఇవ్వనుంది.

Next Story