కేరళలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార ఎల్‌డీఎఫ్ ఆధిక్యంలో దూసుకుపోతుంది. 94 స్థానాల్లో ఎల్‌డీఎఫ్ దూసుకుపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. రెండోసారి విజయం దిశగా దూసుకుపోతోంది లెఫ్ట్ ప్రభుత్వం. ఈ విజయం ముఖ్యమంత్రి పినరయి విజయన్ దే అని చెప్పుకొచ్చారు. కేరళలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 140. అధికారంలోకి వచ్చేందుకు కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు. ఎల్డీఎఫ్ 94 స్థానాల్లో అధిక్యం కనబరుస్తోంది.
కేరళలో సాంప్రదాయానికి విరుద్ధంగా వరుసగా రెండోసారి అధికారంలోకి రానుంది పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కేరళలో ఎల్డీఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆధిక్యాల పరంగా మ్యాజిక్ ఫిగర్ 71 స్థానాల మార్క్‌ను ఆ కూటమి దాటేసింది. దీంతో విజయన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఇక లాంచనమే..! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం వచ్చేసింది.