ఇది నేనేక్క‌డా చూడ‌లే.. త‌లుపులు, గోడ‌లు లేకుండా ఒకే రూమ్‌లో నాలుగు మ‌రుగుదొడ్లు

Photo of 4 squat toilets with no door in UP. ఓ గ్రామంలో నిర్మించిన ప‌బ్లిక్ టాయిలెట్లు చూసి అంద‌రూ ముక్కున వేలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2022 9:02 AM IST
ఇది నేనేక్క‌డా చూడ‌లే.. త‌లుపులు, గోడ‌లు లేకుండా ఒకే రూమ్‌లో నాలుగు మ‌రుగుదొడ్లు

ఇప్ప‌టికి కొన్ని గ్రామాల్లో బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న చేస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆర్థికంగా వెనుక‌బ‌డ‌డంతో సొంతంగా టాయిలెట్లు నిర్మించుకునే శ‌క్తి వారికి లేదు. దీంతో ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చి ప‌బ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తోంది. అయితే.. ఓ గ్రామంలో నిర్మించిన ప‌బ్లిక్ టాయిలెట్లు చూసి అంద‌రూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. తలుపులు, గోడలు లేకుండానే నాలుగు మరుదొడ్లను ఒకదాని పక్కన ఒకటి నిర్మించారు. ఈ టాయిలెట్ల ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదేంట్రా బాబు.. ఇలా నేనేక్క‌డ చూడ‌లే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటీజ‌న్లు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌స్తీ జిల్లాలోని ధ‌న్సా గ్రామంలో త‌లుపులు, గోడ‌లు లేకుండానే నాలుగు మ‌రుగుదొడ్ల‌ను ఒక‌దాని ప‌క్క‌న మ‌రొక‌టి నిర్మించారు. ఇది చూసిన ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌లుగురు వ్య‌క్తులు ఒకే సారి ప‌క్క ప‌క్క‌న ఎలా కూర్చుంటారు అని అధికారుల తీరుపై మండిప‌డుతున్నారు. ఈ టాయిలెట్ల ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇది చూసిన నెటీజ‌న్లు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. వాటిని ప‌గ‌ల‌గొట్టి వివాదానికి అక్క‌డితో ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు పంచాయ‌తీ రాజ్ అధికారులు.

అభివృద్ధి విభాగం ముఖ్య అధికారి రాజేశ్ ప్రజాపతి మాట్లాడుతూ.. రుధౌలి బ్లాక్‌లోని ధన్సా గ్రామంలో నిబంధ‌న‌ల ప్ర‌కారం పబ్లిక్ టాయిలెట్ల‌ను నిర్మించ‌లేద‌న్నారు. జిల్లా పంచాయతీ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటారు. దోషులు ఎవ‌రైనా క‌ఠిన చ‌ర్య‌లు తప్ప‌వ‌న్నారు.

Next Story