బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఎగబడ్డ జనం

Petrol sold for Rs 1per litre in Solapur to protest rising prices.ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2022 10:00 AM IST
బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఎగబడ్డ జనం

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు మండిపోతున్నాయి. వాహ‌నాలు బ‌య‌ట‌కు తీయాలంటేనే వాహ‌నదారులు భ‌య‌ప‌డిపోతున్నారు. ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇది వ‌ర‌కు సందు చివ‌ర ఉన్న షాపుకు వెళ్లాల‌న్నా బండి తీసేవారు.. ఇప్పుడు అత్య‌వ‌సరం అయితే త‌ప్ప బండిని బ‌య‌ట‌కు తీయడం లేదు. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.120కి చేరడ‌మే అందుకు కార‌ణం. ఇలాంటి త‌రుణంలో రూపాయికే లీట‌ర్ పెట్రోల్ ఇస్తామ‌ని ఓ ప్రెటోల్ బంక్ యాజ‌మాన్యం చెప్పింది. ఇంకేముంది జ‌నం ఎగ‌బ‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. నిన్న(ఏప్రిల్ 14న‌) రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సోలాపూర్‌లో ఓ పెట్రోల్ బంక్‌ రూపాయికే పెట్రోల్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అయితే.. ఇందుకు కొన్ని ష‌ర‌తులు కూడా పెట్టారు. మొద‌ట వ‌చ్చిన 500 మందికి మాత్ర‌మే ఒక్క రూపాయికే పెట్రోల్ ఇస్తామని చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వారే కాకుండా ఎక్క‌డెక్క‌క‌డి నుంచో అక్క‌డ త‌ర‌లివ‌చ్చారు ప్ర‌జ‌లు. పెట్రోల్ బంకు ఎదుట పెద్ద ఎత్తున క్యూ క‌ట్టారు. అంత‌కంత‌కూ ర‌ద్దీ పెరుగుతుండ‌డంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని అదుపులోకి పెట్టారు. పెను భార‌మైన పెట్రో ధ‌ర‌ల్ని త‌గ్గించాల‌ని సందేశం ఇచ్చేందుకే ఇలా చేశామ‌ని బంక్ యాజ‌మ‌న్యం చెబుతోంది.

Next Story