చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. వాహనదారుల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా ధరలు మాత్రం పెంచడం ఆపడం లేదు. దీంతో ఫిబ్రవరిలో నెలలో చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి వాహనదారులకు నడ్డి విరిచేలా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక వరుసగా 12 రోజుల పాటు పెరిగి నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 24 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి నె లలోనే 14 సార్లు పెరిగాయి. వరుసగా పెరుగుతున్న ధరలకు ఆదివారం బ్రేకులు పడ్డాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.58 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.80.87 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధరల్లో మార్పులు, డాలురుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గుల వల్లే ఇంధన రేట్లు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్‌లలో)
ఢిల్లీ - పెట్రోల్ రూ. 90.58, డీజిల్ రూ. 80.97
ముంబై - పెట్రోల్ రూ. 97. కు, డీజిల్ రూ. 88.05
చెన్నై - పెట్రోల్ రూ. 92.59, డీజిల్ రూ. 85.98
బెంగళూరు - పెట్రోల్ రూ. 93.61, డీజిల్ రూ. 85.84
హైదరాబాద్ - పెట్రోల్ రూ. 94.18, డీజిల్ రూ. 88.31
అమరావతి - పెట్రోల్ రూ. 96.73, డీజిల్ రూ. 90.33
విజయవాడలో - పెట్రోల్ రూ. 96.10, డీజిల్ ధర 89.72