పెట్రోల్ ధరకు బ్రేకులే పడట్లేదు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
Petrol Price Hiked by up to 26 Paise. పెట్రోల్-డీజిల్ ధరల, రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన దేశీ ఇంధన ధరలు మరోసారి పెరిగాయి.
By Medi Samrat Published on 10 May 2021 10:07 AM ISTపెట్రోల్-డీజిల్ ధరలకు ఏ మాత్రం బ్రేకులు పడడం లేదు. రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన దేశీ ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 36 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్ ధర రూ.95.13కు, డీజిల్ ధర రూ.89.47కు చేరాయి. అమరావతిలో పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.97.56కు చేరింది. డీజిల్ ధర 34 పైసలు పెరుగుదలతో రూ.91.35కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.97.82కు చేరింది. డీజిల్ ధర 34 పైసలు పెరుగుదలతో రూ.91.61కు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.53కు చేరుకుంది. డీజిల్ ధర లీటర్ రూ.82.06 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.86కు చేరుకోగా, డీజిల్ ధర లీటర్ రూ.89.17 అయింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.91.66, డీజిల్ దర రూ.84.90 అయింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.38 కాగా, డీజిల్ ధర రూ.86.96కు చేరింది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.32.98 కాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ రూ.19.55 విధిస్తుంది. డీజిల్ ధర రూ.31.83 నిర్ణయించగా, సెంట్రల్ ఎక్సైజ్ వ్యాట్ రూ.10.99 మరియు డీలర్ కమిషన్ పెట్రోల్ లీటర్‌పై రూ.2.6 రూపాయలు, డీజిల్‌పై రూ.2గా నిర్ణయించారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ ను ప్రభుత్వాలు తగ్గించాయి. దీంతో ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.25 శాతం పెరుగుదలతో 69.07 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.11 శాతం పెరుగుదలతో 65.62 డాలర్లకు ఎగసింది.