సామాన్యుడికి షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా ధరలు ఇలా..

Petrol Diesel Prices Hike In India. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

By Medi Samrat  Published on  7 Feb 2021 3:16 AM GMT
Petrol Diesel Prices Hike In India.

దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరల కారణంగా సామాన్యుడికి భారంగా మారింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడో ఒకసారి తగ్గించినా.. పెరగడం మాత్రం రోజూ ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా.. ధరలు పెరగడం మాత్రం ఆగడం లేదు.

ఇక ఫిబ్రవరి 7న దేశ వ్యాప్తంగా లీటర్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.86.95గా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.77.13కు చేరింది.

హైదరాబాద్‌లో లీటర్‌ ధర రూ.90.42, డీజిల్‌ రూ.84.14గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99గా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.83.99 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ.89.85 ఉండగా, డీజిల్ రూ.81.76గా ఉంది. అలాగే కోల్‌కతాలో పెట్రోల్ రూ.89.30, డీజిల్ రూ.80.71 ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. బడ్జెట్‌ సమావేశాల్లో పెట్రోల్‌ వడ్డన ఉండదని ప్రకటించినా ప్రతి రోజు స్వల్పంగా పెరుగుతూనే ఉంది.




Next Story