ఆల్‌టైం రికార్డుస్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol Diesel Prices Hike. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయి.

By Medi Samrat  Published on  27 Jan 2021 4:24 AM GMT
Petrol Diesel Prices Hike

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మంగ‌ళ‌వారం నాడు నాడు పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్కో లీట‌ర్‌కు 35 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. నేడు మరో 27 పైసలు వడ్డించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. కాగా, చమురు కంపెనీలు గత కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా ధరలు పెంచుతూ వస్తున్నాయి.

తాజాగా పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.30కు చేర‌గా, డీజిల్‌ ధర రూ.76.48కి పెరిగింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రో ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇక తాజా పెరుగుద‌ల‌తో ముంబైలో పెట్రోల్ ధ‌ర‌‌ రూ. 92.86, డీజిల్ ధ‌ర‌‌ రూ.83.30కి చేరాయి. ఇక‌ జైపూర్‌లో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌ రూ.93.60కు చేర‌గా.. డీజిల్ ధ‌ర‌ రూ.85.67కు చేరింది.

ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర ధర రూ.89.51గా ఉండగా, డీజిల్ ధర రూ. 83.19కు చేరింది. బెంగళూరులో పెట్రోల్‌ రూ.88.95, డీజిల్‌ రూ.80.84, చెన్నైలో పెట్రోల్‌ రూ.88.60, డీజిల్‌ రూ.81.47, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.87.45, డీజిల్‌ రూ.79.83కి చేరాయి. పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యుడు అడుగు బ‌య‌ట పెట్టాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. చమురు ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధమైన పన్నును ఆయా ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. మ‌రి ఈ ధ‌ర‌ల‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్పుడు చెక్ పెడ‌తాయో చూడాలి మ‌రి.


Next Story