GHMC డివిజన్లు పెంపుపై హైకోర్టులో పిటిషన్
జీహెచ్‌ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది
By - Knakam Karthik |
GHMC డివిజన్లు పెంపుపై హైకోర్టులో సవాల్..విచారణ వాయిదా
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని వినయ్ కుమార్ నే వ్యక్తి న్యాయస్థానాన్ని కోరారు. జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. డివిజన్ల పెంపు పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరిన పిటిషనర్ తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. రాంనగర్ డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
మేయర్‌కు కాంగ్రెస్ కార్పొరేటర్ల విజ్ఞప్తి
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరపాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. డివిజన్ల పురనర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతిపత్రం ఇచ్చామన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ ఏ ప్రాతిపదికన ప్రకారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు