రైల్వేస్టేషన్‌లో టీవీల్లో పోర్న్‌ వీడియో ప్రసారం.. ముఖాలు తిప్పేసుకున్న ప్రయాణికులు

బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో అందరూ ముక్కున వేలేసుకునే ఘటన జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్

By అంజి  Published on  20 March 2023 1:15 PM IST
Patna railway station, Bihar, Indian Railways

రైల్వేస్టేషన్‌లో టీవీల్లో పోర్న్‌ వీడియో ప్రసారం.. ముఖాలు తిప్పేసుకున్న ప్రయాణికులు

బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో అందరూ ముక్కున వేలేసుకునే ఘటన జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌లపై ఆదివారం ఉదయం 9:30 గంటలకు మూడు నిమిషాల పాటు ప్లే అవుతున్న ప్రకటనల స్థానంలో అడల్ట్ ఫిల్మ్ ప్లే కావడంతో వందలాది మంది ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందరూ ఛీ..ఛీ అనుకుంటూ ముఖాలు తిప్పేసుకున్నారు. ఆ వెంటనే ప్రయాణీకులు సమయాన్ని వృథా చేయకుండా గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఫిర్యాదు చేశారు. జీపీఆర్‌ చర్య తీసుకోవడంలో నిర్లక్యం చేసిన తర్వాత.. ఆర్‌పీఎఫ్‌ స్క్రీన్‌లపై ప్రకటనలను ప్రదర్శించడానికి బాధ్యత వహిస్తున్న ఏజెన్సీ అయిన దత్తా కమ్యూనికేషన్‌ను సంప్రదించింది.

మహిళలు, పిల్లలతో సహా ప్రజల ముందు శృంగార వీడియో క్లిప్‌ను ప్రసారం చేయడాన్ని ఆపమని ఏజెన్సీ నిర్వాహకులను కోరింది. తరువాత రైల్వే అధికారులు చర్యలకు దిగారు. దత్తా కమ్యూనికేషన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఏజెన్సీని రైల్వే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు జరిమానా కూడా విధించింది. రైల్వే స్టేషన్‌లోని టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనలు ప్రసారం చేయడానికి ఏజెన్సీకి ఇచ్చిన ఒప్పందాన్ని రైల్వే అధికారులు రద్దు చేసినట్లు వర్గాల సమాచారం. దీనిపై రైల్వే శాఖ ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా, ప్లాట్‌ఫారమ్ నంబర్ 10లోని టీవీల్లో మాత్రమే ప్రత్యేకంగా వీడియో ప్రసారం కావడం కొందరు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story