ప్రయాణికురాలి ఆహారంలో రాయి.. ఎయిరిండియా విమానంలో ఘటన

Passenger finds stone in Air India in-flight meal. ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది.

By అంజి  Published on  11 Jan 2023 11:34 AM IST
ప్రయాణికురాలి ఆహారంలో రాయి.. ఎయిరిండియా విమానంలో ఘటన

ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో ఆమెకు అందించిన ఆహారంలో రాయి కనిపించింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. ఈ ఘటన జనవరి 8న ఢిల్లీ నుంచి ఖాట్మాండు వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానంలో జరిగింది. భోజనం వచ్చిన రాయి ఫొటోలను సదరు ప్రయాణికురాలు ట్వీటర్‌లో పంచుకుంది. దీనిపై స్పందించిన విమానయాన సంస్థ.. క్యాటరర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

ఎయిర్‌ ఇండియాను ట్యాగ్‌ చేస్తూ.. ప్రయాణికురాలు స్వరప్రియ సాంగ్వాన్‌ జనవరి 8న ట్వీట్‌ చేసింది. ''రాళ్ల లేని ఆహారాన్ని అందించడానికి మీకు వనరులు, డబ్బు అవసరం లేదు. విమానంలో అందించిన భోజనం చిత్రాలను పంచుకుంటూ.. ఇది ఫ్లైట్ AI 215లో అందించబడిన ఆహారం అని ఆమె చెప్పింది. ట్వీట్‌పై స్పందిస్తూ.. ఎయిర్ ఇండియా ''ఇది ఆందోళన కలిగించే విషయమని, మేము మా క్యాటరింగ్ టీమ్‌తో దీన్ని వెంటనే తీసుకుంటున్నాము" అని ట్వీట్ చేసింది.

''దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి. మీరు దీన్ని మా దృష్టికి తీసుకురావడాన్ని మేము అభినందిస్తున్నాము'' అని జనవరి 8 న ఎయిర్‌లైన్ ట్వీట్‌లో పేర్కొంది. ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ ఎయిర్ ఇండియా ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటనలో ఇలా అన్నారు. ''ఏఐ 215లో ఒక ప్రయాణికురాలు తన భోజనంలో రాయిని కనుగొన్న సంఘటనను ఎయిర్ ఇండియా తీవ్రంగా పరిగణించింది. మేము క్యాటరర్‌తో ఈ విషయాన్ని తీసుకున్నాము. క్యాటరర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాము'' అని చెప్పారు.

రెండు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగాను టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)చే నిప్పులు చెరిగింది. రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇటీవల ఎయిర్ ఇండియాలో రెండు మూత్ర విసర్జన ఘటనలు జరిగాయి. మొదటి సంఘటన నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్ AI 102లో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న మహిళా ప్రయాణీకురాలిపై (సీనియర్ సిటిజన్) శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేయడంతో మొదటి సంఘటన జరిగింది.

డిసెంబరు 6న మరో సంఘటన జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 142లో ఓ మహిళా ప్రయాణికురాలిపై మద్యం మత్తులో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.

Next Story