వైరల్: 'పెళ్లికి పిల్లను వెతికి పెట్టండి'.. ఎమ్మెల్యేకు కార్యకర్త ఫోన్
Party worker asks MLA to find woman for marriage in maharashtra. తాను పెళ్లి చేసుకునేందుకు ఓ అమ్మాయిని వెతికి పెట్టండి అంటూ కార్యకర్త స్థానిక ఎమ్మెల్యేను
By అంజి Published on 11 Jan 2023 10:34 AM ISTతాను పెళ్లి చేసుకునేందుకు ఓ అమ్మాయిని వెతికి పెట్టండి అంటూ కార్యకర్త స్థానిక ఎమ్మెల్యేను ఫోన్‌లో కోరాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. కాగా ఎమ్మెల్యేకు, కార్యకర్తకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన కన్నాడ్ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్‌ను ఓ కార్యకర్త పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతకమని కోరాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే అసలైన సమస్య అంటూ వివరించాడు.
ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్, పార్టీ కార్యకర్త మధ్య ఉల్లాసంగా అనిపించే సంభాషణ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. పొరుగున ఉన్న ఖుల్తాబాద్ ప్రాంతానికి చెందిన పార్టీ కార్యకర్త సోమవారం ఠాక్రే శిబిరంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేకు సోమవారం నాడు ఫోన్ చేసి జీవిత భాగస్వామిని కనుగొనమని అభ్యర్థించాడు. ''నాకు 8-9 ఎకరాల భూమి ఉంది. కానీ నాకు అమ్మాయిని (పెళ్లి కోసం) ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కన్నడ ఏరియాలో ఆడపిల్లలున్నారు'' అని చెప్పాడు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజ్‌పుత్.. బయోడేటాను తనకు పంపమని పార్టీ కార్యకర్తను కోరాడు. ఇదే అంశంపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆ వ్యక్తి ఆందోళన గ్రామాల్లో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోందని అన్నారు. ''పరిస్థితి అంత బాగా లేదు. 2,000 మంది నివాసితులు ఉన్న గ్రామం ఉంటే, అక్కడ మీకు దాదాపు 100-150 మంది పెళ్లికాని యువకులు కనిపిస్తున్నారు. వారికి 100 ఎకరాల భూమి ఉన్నా, పెళ్లికి అమ్మాయి దొరకడం కష్టంగా ఉంది' అని రాజ్‌పుత్ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లోని వారికే.. కొన్ని కుటుంబాలు తమ కూతుళ్లకు పెళ్లి చేయాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం, మహారాష్ట్ర లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 920 మంది స్త్రీలు ఉన్నారు.