సమస్య ఏదైనా భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది: రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌

Parliament Budget Session 2021. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు.

By Medi Samrat  Published on  29 Jan 2021 2:29 PM IST
Parliament Budget Session 2021

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి, బర్డ్‌ఫ్లూపై భారత పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్వయం సమృద్ది సాధించడమేనేది ఒక స్వప్నమని అన్నారు. సమస్య ఏదైనా భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కొందని ప్రపంచ దేశాలకు చాటిచెప్పామన్నారు. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో కొనసాగుతోందని, దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. అనేక దేశాలకు లక్షల డోసులను సరఫరా చేశామని, సంక్షోభం సమయంలో పొరుగుదేశాలతో కలిసి సాగుతున్నామన్నారు. దేశ ప్రజలందరికీ జీవన స్థితిగతుల ఉన్నతికి ఆత్మ నిర్భర్‌ భారత్‌ బాటలు వేసిందన్నారు. దేశ రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను తీసుకువచ్చామని రాష్ట్రపతి అన్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగమని, కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయని తెలిపారు. విస్తృత చర్చల తర్వాతే కొత్త చట్టాలను పార్లమెంట్‌లో ఆమోందించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. రైతులకు విస్తృత అవకాశాలు, రైతులకు మరింత లబ్ది కలిగించేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చామని, ఈ చట్టాలతో పది లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగమని రాంనాథ్‌ కోవింద్‌ తన ప్రసంగంలో వెల్లడించారు.

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలను పెంచుతోందని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సాగు చట్టాలపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. ఇందుకోసం అనేక పథకాలు తీసుకువచ్చామని, కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రూ. లక్షా 13 వేల కోట్లు రైతుల ఖాతాల్లో బదిలీ అయ్యాయన్నారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించాని అన్నారు.

మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనున్నామని, చిన్న, సన్నకారుల రైతులపై మరింత శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందని, రిపబ్లిక్‌ డే రోజున ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి అన్నారు.


Next Story