బెంగళూరులో అక్రమంగా ఉంటున్న పాకిస్థానీ యువతి అరెస్ట్

Pakistani girl illegally staying in Bengaluru arrested. బెంగళూరు : భారత్‌లో అక్రమంగా ఉండేందుకు తన గుర్తింపును నకిలీ చేసిన 19 ఏళ్ల పాకిస్థానీ

By అంజి  Published on  23 Jan 2023 9:03 AM IST
బెంగళూరులో అక్రమంగా ఉంటున్న పాకిస్థానీ యువతి అరెస్ట్

బెంగళూరు : భారత్‌లో అక్రమంగా ఉండేందుకు తన గుర్తింపును నకిలీ చేసిన 19 ఏళ్ల పాకిస్థానీ యువతిని బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. దీంతో పోలీసులు యువతి ఇక్రా జీవిని అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత ఆమెను స్టేట్ హోంకు పంపించారు. కొన్ని నెలల క్రితం డేటింగ్ యాప్ ద్వారా కలుసుకుని పాకిస్థాన్ యువతి ఇక్రాని పెళ్లి చేసుకున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన 25 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ అనే సెక్యూరిటీ గార్డును కూడా బెల్లందూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భారత్-నేపాల్ సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశించింది. డేటింగ్ యాప్‌లో యాదవ్ ఇక్రాతో స్నేహం చేశాడని, వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని దర్యాప్తులో తేలింది. సెక్యురిటీ గార్డు కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకుని ఆమెను నేపాల్‌కు పిలిపించాడు. ఈ జంట బీహార్‌లోని బిర్‌గంజ్ చేరుకోవడానికి నేపాల్‌ దాటి అక్కడ నుండి పాట్నా చేరుకున్నారు. యాదవ్, ఇక్రా తరువాత బెంగళూరుకు వచ్చి జున్నసంద్రలోని అద్దె ఇంట్లో ఉన్నారు. అక్కడ యాదవ్ సెప్టెంబర్ 2022 నుండి సెక్యూరిటీ గార్డుగా పని చేయడం ప్రారంభించాడు.

అతను ఇక్రా పేరును రావ యాదవ్‌గా మార్చిన తర్వాత ఆమె కోసం ఆధార్ కార్డును పొందాడు. భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇక్రా పాకిస్థాన్‌లోని తన కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు కేంద్ర నిఘా సంస్థల స్కానర్ కిందకు వచ్చింది. కేంద్ర ఏజెన్సీలు కర్ణాటక ఇంటెలిజెన్స్‌ను అప్రమత్తం చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థానీ ఏదైనా గూఢచర్యం రింగ్‌లో భాగమేనా అని తనిఖీ చేయడానికి తదుపరి పరిశోధనలు కొనసాగుతున్నాయని వర్గాలు తెలిపాయి

Next Story