ఢిల్లీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు

Pakistan Zindabad slogans raised in Delhi's Khan Market. ఢిల్లీలో ఖాన్ మార్కెట్ మెట్రో వ‌ద్ద పాకిస్థాన్ అనుకూల నినాదాల క‌ల‌క‌లం చెల‌రేగింది.

By Medi Samrat  Published on  24 Jan 2021 10:31 AM GMT
Delhi khans Market

ఢిల్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఖాన్ మార్కెట్ మెట్రో వ‌ద్ద పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఐదుగురు యువ‌తీయువ‌కులు ఈ నినాదాలు చేశారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని పాక్ అనుకూల నినాదాలు చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు. పాక్ అనుకూల నినాదాలు చేయ‌డం ప‌ట్ల వారిని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఆదివారం అర్ధ రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని, యువ‌త బైక్ రేసింగ్ కు పాల్ప‌డుతోన్న స‌మ‌యంలో ఈ నినాదాలు వినిపించాయ‌ని పోలీసులు చెబుతున్నారు. బైక్ రేసింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఒక్కో బైక‌ర్ ఒక్కో దేశం పేరు పెట్టుకున్నార‌ని, వారిని అక్క‌డుకున్న వారు ఆ దేశం పేరుతో పిలిచార‌ని పోలీసులు అంటున్నారు.

ఢిల్లీ పోలీసులు శనివారం అర్ధరాత్రి సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయని సమాచారం అనుకున్నారు. అది కూడా ఢిల్లీ లోని ఖాన్ మార్కెట్ ఏరియాలో..! వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఈ నినాదాలు చేస్తున్న ఇద్దరు మగవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్లను అదుపులోకి తీసుకున్నారు. తమకు పిసిఆర్ కాల్ వచ్చిందని.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్ దగ్గర వినిపించాయని అందులో చెప్పారని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా బైక్ లకు పలు దేశాల పేర్లు పెట్టి రేసింగ్ నిర్వహిస్తూ వచ్చారని చెప్పుకొచ్చారు. ఉదయం 1 గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల దగ్గర బ్లూ రంగు యూలు బైక్లు ఉన్నాయి. అదుపులోకి తీసుకున్న వారి కుటుంబాలను కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు.


Next Story
Share it