ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం పంపింది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 12:45 PM ISTఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం పంపింది. ఇస్లామాబాద్‌కు రావాలని కోరింది. ఈ ఏడాది అక్టోబర్‌లో పాక్‌లోని ఇస్లామాబాద్ వేదిగా కౌన్సిల్ ఆఫ్ హెడస్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి రావాలంటూ పేర్కొంది పాకిస్తాన్. ప్రధాని నరేంద్రమోదీతో పాటుగా షాంఘౌ సహకార సంస్థకు చెందిన ఇతర నేతలను పాకిస్థాన్ ఆహ్వానించింది. గతేడాది ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్ నగరంలో నిర్వహించిన ఎస్‌సీవో సదస్సుకు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలు హాజరు అయ్యారు.
పాకిస్థాన్ ఆహ్వానం తర్వాత ప్రధాని మోదీ అక్కడి వెళ్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. అయితే.. పాక్‌తో సమస్మాత్మక సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను పంపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే.. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిగాయి. విదేశాంగ మంత్రి భద్రతపైనా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆయన కూడా పాకిస్థాన్ వెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. చివరి సారిగా 2015లో అప్పటి భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌లో పర్యటించారు.
సీహెచ్‌జీకి అధ్యక్షత వహిస్తున్న పాక్ అక్టోబర్ 15-16 తేదీల్లో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో నాయకులు స్వయంగా పాల్గొనలేని పరిస్థితుల్లో వర్చువల్ విధానం ఉంటుందా లేదా అనే విషయంపైనా క్లారిటీ రావాల్సి ఉంది. కార్గిల్ దివస్ కార్యక్రమంలో ఇటీవల పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.